జోగులాంబ సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.





