నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని CP అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసుల పురోగతిని పరిశీలించారు. ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. గంజాయి, ఇసుక, నిఘా పెట్టాలని, మహిళలు, చిన్నారుల కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.



