రోజూ సబ్జా తీసుకుంటే ఏమవుతుంది?

ఎముకలు బలంగా ఉండేందుకు క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అవసరం. ఇందుకోసం సబ్జా గింజలు బెస్ట్ న్యూట్రిషన్ సోర్స్‌గా చెప్పుకోవచ్చు. Applied Food Research ప్రకారం.. 100 గ్రాముల సబ్జాల్లో సుమారు 700 నుంచి 750 మిల్లీగ్రాములు క్యాల్షియం ఉంటుంది. రోజూ ఓ చెంచాడు సబ్జాలు తీసుకుంటే 100 నుంచి 115 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఈ సీడ్స్‌లో ఉండే విటమిన్ D కూడా బాడీకి అవసరం. ఇది శరీరంలోకి క్యాల్షియం బాగా చేరేందుకు సహాయపడుతుంది. సబ్జాలను సంవత్సరమంతా ఆహారంలో చేర్చుకోవచ్చు.



