అత్తాపూర్ PS ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లాయర్లపై పోలీసులు దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు PSలోని సీసీటీవీ ఫుటేజీని సర్టిఫికెట్‌తో పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలని రాజేంద్రనగర్ డీసీపీని ఆదేశించింది. వృత్తిపరమైన పని కోసం వెళ్లిన ఇద్దరు <a href="https://www.theclearcutnews.com/n/v7BdGBc">లాయర్లు</a>, అక్కడి ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తర్వాత విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.



