కారులోనే షర్మిల ప్రొటెస్ట్..
AP:విజయవాడ ఛలో లోక్‌భవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వినూత్నంగా కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని, చేతిలో రాజ్యాంగాన్ని చూపిస్తూ నిరసన తెలిపారు. లోక్‌భవన్ ముట్టడికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆమె ఈ విధంగా నిరసన తెలిపారు. తనకు వెళ్లేందుకు అనుమతిచడం లేదని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.



