← Back to news

బీబీపేట్‌లో మట్టి గణపతుల పంపిణీ

By Ramu· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
బీబీపేట్‌లో మట్టి గణపతుల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. యం. పెరమాండ్లు పాల్గొని మట్టి వినాయకుడి ప్రతిమను అందజేశారు. గత 13 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పెట్టుకోవాలన్నారు.

More in Local