పండుగ సాయన్న 174వ జయంతి.. షాద్నగర్ సిద్ధం!

రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు అక్టోబర్ 22న ఘనంగా జరగనున్నాయి. నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్కు ఆహ్వాన పత్రికలు అందజేశారు. సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ వేడుకలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అందే బాబయ్య, మంగ వెంకటేష్, నల్లమోని శ్రీధర్, అందే మోహన్, మంగ మధు, బాల్రాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు!



