స్కూళ్లకు హాలిడే, KU ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్!

TG : తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి నుంచి పడుతున్న వర్షాల వల్ల అధికారులు అలర్ట్ అయ్యారు. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో ముందుజాగ్రత్తగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు హాలిడే అనౌన్స్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్‌పోన్ అయ్యాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.



