RSS సెమినార్‌పై నిరసన.. ఐదుగురు స్టూడెంట్స్ సస్పెండ్!

కేరళలోని సెంట్రల్ యూనివర్సిటీలో ‘వందేమాతరం’ సెమినార్‌పై వివాదం రేగింది. RSSతో సంబంధాలున్న వ్యక్తిని ఇన్వైట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. దీంతో ఐదుగురు స్టూడెంట్ లీడర్స్‌ను యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. మరోవైపు, 25 మంది గుర్తుతెలియని విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ క్లాసులు బాయ్‌కాట్ చేసి, సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

