గణేష్ గడ్డలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు హరిద్రవర్ణ అలంకరణలో సిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్) ఆలయానికి చేరుకుని సిద్ధి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది.
