స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్!

స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లపై మనం చేసే ఒకే ఒక్క తప్పు ట్యాప్ (Tap) వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పొరపాటున ఎవరికో వెళ్లాల్సిన మెసేజ్ మరొకరికి వెళ్లడం, పొరపాటున పేమెంట్లు జరిగిపోవడం లాంటివి చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాయి. యాప్స్ అన్నీ చాలా ఈజీగా యూజ్ చేసేలా డిజైన్ చేయడం వల్లే యూజర్లు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. బ్రెయిన్ కంటే థంబ్ (బొటనవేలు) ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వడమే దీనికి రీజన్. అందుకే ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండటానికి ఒక్కోసారి అలర్ట్ పాప్-అప్స్ లాంటివి హెల్ప్ అవుతాయంటున్నారు.



