← Back to news

కళ్యాణదుర్గంలో చిరుతల హల్చల్..}

By Jagadish· 3h ago
కళ్యాణదుర్గంలో చిరుతల హల్చల్..}

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ శివారులో కొండపై రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు, రాకపోకలు చేసే వాహనదారులకు అవి కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయోనని గుప్పిట్లో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. చిరుతలను సురక్షితంగా రక్షించి, ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ఊరిలో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి!

More in Local