డోర్ డెలివరీ ‘మీ-సేవ’

TG: తెలంగాణలో ‘మీ-సేవ డోర్ డెలివరీ’ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. తొలిదశలో ఎంపిక చేసిన ‘క్యూర్’ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా మీ-సేవ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే జనన, మరణ, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, కొన్ని పోలీస్ శాఖ సేవలను ఇంటి వద్దే పొందొచ్చు. ప్రజల స్పందనను బట్టి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.



