← Back to news

చేయూత పింఛన్ల దరఖాస్తులపై లేటెస్ట్ అప్‌డేట్

By Bala· 7h ago
చేయూత పింఛన్ల దరఖాస్తులపై లేటెస్ట్ అప్‌డేట్

TG: చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 25 వరకు ఉన్న గడువును 30 వరకు పొడిగిస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) CEO దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు SIR విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండటంతో నిర్ణీత గడువులోగా దరఖాస్తుల పరిశీలన కష్టమైందన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

More in TG