← Back to news

షాద్‌నగర్‌లో మట్టి గణపతులు

By Adithya· 2d ago· Ranga Reddy
షాద్‌నగర్‌లో మట్టి గణపతులు

పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో షాద్‌నగర్‌లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో క్లబ్ ప్రెసిడెంట్ ఎల్కుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్విరాన్మెంట్‌ను సేవ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంబర్స్ పాలాది వెంకటరమణ, కల్వ మాణిక్యం, ఎంసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in Local