← Back to news

ఆలయంలో చోరీ.. వెండి వస్తువులు గాయబ్!

By Jagadish· 18h ago
ఆలయంలో చోరీ.. వెండి వస్తువులు గాయబ్!

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పి.కొట్టం గ్రామంలో దొంగతనం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. స్వామివారి వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఆలయ ధర్మకర్త బొంగు గోపాలకృష్ణ సోమవారం ఉదయం విషయం గుర్తించారు. కీరీటం, శంఖు చక్రాలు, మొద్దుకస్తము, వెండి పాదాలు తదితర విలువైన వస్తువులు పోయాయి. సుమారు మూడు నుంచి నాలుగు కేజీల వెండి వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్ ను సైతం దుండగులు తీసుకెళ్లారు.

More in Local