బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: పవన్ ఖేరా
అధికార BJP ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తోందని, ప్రజల ఓట్లతో గెలిచే హక్కును భంగపరుస్తోందని AICC మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా ఆరోపించారు. దేశంలోని ప్రజలందరూ ఏకగ్రీవంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని 'ఓటు దొంగ' ప్రభుత్వం అని పిలుస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని ఓడించి, ప్రస్తుతం ఉన్న సమాజ విద్రోహ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


