← Back to news

రాజాంలో పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్

By Mohan· 2d ago

AP: విజయనగరం జిల్లా రాజాంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. తృప్తి రిసార్ట్‌లో గండి చిరంజీవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, LED స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ సందేశాన్ని వీక్షించారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్య కూడా కేక్ కటింగ్ నిర్వహించి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

More in Local