← Back to news

స్కూళ్లలోనూ ఫేక్‌ ఫైర్‌ NOCలు!

By A.Ajay· 2h ago
స్కూళ్లలోనూ ఫేక్‌ ఫైర్‌ NOCలు!

TG: హైదరాబాద్ చందానగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల సమర్పించిన ఫైర్‌ NOC నకిలీదని హైడ్రా విచారణలో తేలింది. హైడ్రా కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి NOC తయారు చేసినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. మరో నాలుగు పాఠశాలలు సమర్పించిన ఫైర్‌ NOCలపైనా కంప్లైంట్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో అర్బన్‌ రీజియన్‌లోని పాఠశాలలు సమర్పించిన NOCల వివరాలు ఇవ్వాలని హైడ్రా, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ను కోరింది. గతంలో 142 జూనియర్‌ కాలేజీల NOCలను పరిశీలించగా 52 నకిలీవని తేలింది.

More in TG