← Back to news

BSF అదుపులో 25 మంది బంగ్లాదేశ్ పౌరులు, ఒక దళారి

By Vishi· 1d ago
BSF అదుపులో 25 మంది బంగ్లాదేశ్ పౌరులు, ఒక దళారి

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా కుష్‌మండి బ్లాక్‌ లోహగంజ్-పంచనగర్ ప్రాంతంలో Border Security Force(BSF) 25 మంది బంగ్లాదేశ్ పౌరులను, భారతీయ దళారిని అదుపులోకి తీసుకుంది. నిన్న తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బంగ్లాదేశ్‌లోని ఠాకుర్‌గావ్ జిల్లాకు అక్రమంగా తిరిగి వెళ్లాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. గంగారాంపూర్‌కు చెందిన రాజు రాయ్ అనే దళారి ప్రతి వ్యక్తి నుంచి 12 వేలు తీసుకుని సరిహద్దు దాటించేందుకు సాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

More in National