జుంటుపల్లి కాల్వల ఆధునీకరణకు శంకుస్థాపన

యాలాల్ జుంటుపల్లి ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణ పనులకు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ₹5.71 కోట్లతో శంకుస్థాపన చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని, కాల్వల ఆధునీకరణతో నీటి వృథా తగ్గి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయని, జుంటుపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.


