అరకు రైల్వే కాలనీలో ఘనంగా సరస్వతీ పూజ
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాలనీలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక సరస్వతీ పూజ నిర్వహించారు. చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.



