'భార్యకు ఇది చెప్పండి'.. ఒవైసీ సలహా!
AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. పెళ్లైన వారికి ఓ సలహా ఇచ్చారు. 'ఎవరితో పెళ్లి జరిగిందో వారికి I Love You చెప్పండి' అన్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. "ఎవర్ని ప్రేమించారో, వారిని పెళ్లి చేసుకొని, 'ఐ లవ్ యూ' చెప్పండి. పెళ్లి జరిగితే సగం 'ఈమాన్' పూర్తవుతుంది. జీవితంలో సెట్ అవ్వాలని ఎదురుచూడకండి.. పెళ్లి చేసుకుంటే, సెట్ అయిపోతారు" అని సూచించారు. దేశంలో యువత త్వరగా పెళ్లి చేసుకోవట్లేదు. అందుకే ఒవైసీ ఈ సలహా ఇచ్చారు.


