జడ్చర్ల MBC మిషన్ ఆస్తులపై కూల్చివేత ప్రయత్నాలు..!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కౌరంపేటలో టెన్షన్. MBC మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలోని పాత ఆసుపత్రి భవనాలు, నివాస గృహాలను కూల్చివేసేందుకు కొందరు వ్యక్తులు JCBలు, హిటాచీలతో ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం తమ దృష్టికి వచ్చిందని రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కాశపోగు ప్రసాద్ తెలిపారు. డాక్టర్ పి.ఆర్. ఆర్నాల్డ్ కుమార్తె డాక్టర్ అనురాధను కలిసి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. క్రిస్టియన్ ఆస్తులపై దౌర్జన్యాలను అడ్డుకోవాలని, MBC మిషన్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
