ట్రయల్ రూమ్స్‌లో రహస్య కెమెరాలకు చెక్! రంగంలోకి 'షీ నేత్ర' టీమ్స్!

హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం సీపీ సజ్జనార్ 'షీ నేత్ర టీమ్స్'ను ప్రారంభించారు. నగరంలోని హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, ముఖ్యంగా బట్టల దుకాణాల్లోని ట్రయల్ రూమ్స్‌లో రహస్య కెమెరాలను గుర్తించేందుకు ఈ 7 ప్రత్యేక బృందాలు అత్యాధునిక డిటెక్టర్లతో తనిఖీలు చేయనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు తప్పవని సీపీ హెచ్చరించారు. మహిళల వ్యక్తిగత గోప్యతను కాపాడటమే ఈ బృందాల ప్రధాన లక్ష్యం.



