ఎన్నికల హామీలు నెరవేర్చాలి: బీఆర్ఎస్

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి లేఖ అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

