← Back to news

సిబ్బంది లేకున్నా ఫ్యాన్లు.. విద్యుత్ వృథా

By Srikanth Goud· 2h ago· Jagitial, Jagitial, Jagitial

TG: జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సిబ్బంది లేకున్నా ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూ విద్యుత్ వృథా అవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోయినా విద్యుత్ పరికరాలను ఆపకుండా వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు విమర్శించారు. ప్రజాధనంతో విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వృథాను వెంటనే అరికట్టాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయాల్లో విద్యుత్ వినియోగంపై పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరారు.

More in Local