గాంధీ ఆస్పత్రిలో చిన్నారులకు వెంటిలేటర్ కష్టాలు!

TG: హైదరాబాద్ నగరం గాంధీ హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో కొన్ని వెంటిలేటర్లు పనిచేయడం లేదు. దీంతో అత్యవసర సమయంలో శిశువులు, ఏడేళ్లలోపు పిల్లలకు వెంటిలేటర్ అవసరమైతే అందుబాటులో ఉన్నవాటినే ఒకరి తర్వాత ఒకరికి ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. కరోనా సమయంలో దాతలు ఇచ్చిన కొన్ని వెంటిలేటర్లు ప్రస్తుతం పనిచేయడం లేదని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. పాడైన వెంటిలేటర్లను గుర్తించి రిపేర్ చేయిస్తామని ఆమె చెప్పారు.



