← Back to news

పువ్వుల సాగుతో రైతులకు లాభాల బాట

By DK· 1d ago· ఆదిలాబాద్ జిల్లా
పువ్వుల సాగుతో రైతులకు లాభాల బాట

పువ్వులు, కూరగాయల సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మావల మండలం బట్టిసావర్గం శివారులో బొమ్మల స్వామి పువ్వుల తోటను, తలమడుగు మండలం కజ్జర్లలో కొప్పుల కిరణ్ పువ్వుల తోట, టమాటా పంటలను ఆయన బైక్‌పై వెళ్లి పరిశీలించారు. ఎకరాకు ₹.35 వేల నుంచి ₹.40 వేల పెట్టుబడితో సుమారు 5 టన్నుల పువ్వుల దిగుబడి, ₹.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

More in Local