ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు CRPF జవాన్లు మృతి
TG:ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పస్రా-తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ దగ్గర వేగంగా వచ్చిన లారీ రెండు వెహికల్స్‌ను ఢీకొట్టింది. తొలుత CRPF జవాన్లు ప్రయాణిస్తున్న DCM వెహికల్‌ని ఢీకొట్టడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత అదే లారీ రెవెన్యూ శాఖకు చెందిన కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్ కోసం ఎంక్వయిరీ చేస్తున్నారు.


