← Back to news

రైతుల సమస్యలపై అధికారుల ఆరా

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 1d ago· Nagarkurnool

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల, కురుమిద్ద గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది శుక్రవారం పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మరో రెండు నెలలపాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని, రాత్రివేళ కనీసం మూడు గంటల సరఫరా ఉండాలని రైతులు కోరారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక AE జానకి రామ్ నాయక్, లైన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, లైన్మెన్ బాబా, సిబ్బంది శ్రీనివాసులు, కుమార్, హాజీ బాబా తెలిపారు.

More in Local