మూడో బిడ్డకు రూ.50 వేల FD.. ఎందుకో తెలుసా?

గుజరాత్‌లోని ‘కచ్ కడ్వా పాటీదార్ సమాజ్’(KKPS) కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు 50 వేల రూపాయల Fixed Deposit ఇవ్వాలని నిర్ణయించింది. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ఈ ప్రయోజనం అందించనున్నారు. తమ సమాజంలో తగ్గుతున్న బర్త్ రేట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకున్నట్లు KKPS తెలిపింది. మూడో బిడ్డ పుట్టిన తర్వాత నిర్దేశించిన రూల్స్ ప్రకారం FD అందజేయనున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



