ప్రభుత్వ పథకాలపై అపోహలు సృష్టిస్తున్నారు: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాల విషయంలో ప్రతిపక్షాల నాయకులు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మందికి రూ. 50 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి, త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పురపాలక చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ పాల్గొన్నారు.



