← Back to news

వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్

By Mohan· 2d ago
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్

AP: విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసి నాయుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష పదవిని బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్

More in Local