హైవే పోలీసులమంటూ బెదిరింపులు..జాగ్రత్త

బ్రహ్మంగారి మఠం హైవేపై పోలీసులమని చెప్పి డ్రైవర్లను బెదిరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఐచర్ డ్రైవర్లను అడ్డుకుని, ఫైబర్ లాఠీ చూపిస్తూ "గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపుతాం" అని బెదిరించి ఫోన్ లాక్కున్నారు. బాధితుల ఫిర్యాదుతో కడపకు చెందిన పాలకీర్తి కిరణ్, పాలకీర్తి శ్యామ్ బాబులను లింగాలదిన్నె క్రాస్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి కారు, ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.
