24 గంటల కరెంటు కోసం రైతుల ధర్నా

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గట్టు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా కొనసాగుతోంది. సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు వివిధ రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంటలకు సాగునీరు అందాలంటే 24 గంటల విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు.



