గొంతు కోసి గోల్డ్ ఎత్తుకెళ్లారు

TG : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో విషాదం జరిగింది. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న 75 ఏళ్ల పోచమ్మను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా లోపలికి వచ్చి, ఆమె గొంతు కోసి చంపేశారు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న గోల్డ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



