← Back to news

NHM ఉద్యోగులకు హరీశ్‌రావు మద్దతు

By A.Ajay· 2h ago

సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగాలను చాయ్‌ తాగినంత సమయంలోనే క్రమబద్ధీకరిస్తామని చెప్పిన CM రేవంత్‌రెడ్డి ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. NHM, ఆయుష్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని, పెండింగ్‌ జీతాలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు BRS అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

More in TG