తాగునీరు వృథా.. ఫౌంటెన్ లా ఎగసిపడుతోంది!
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయింది. వేలాది లీటర్ల తాగునీరు రోడ్డుపై ఫౌంటెన్ లా ఎగసిపడుతూ వృథా అవుతోంది. పరిసరాలు బురదమయంగా మారి దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 6వ వార్డులో చాలా ఇళ్లకు నీరు రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోందని, వెంటనే లీకేజీలను అరికట్టి నీటి సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మీ ఊర్లో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి!
