మద్యం టెండర్ మోసం.. కారుమూరి సునీల్ ను విచారిస్తున్న SIT

మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను SIT అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ టెండర్ల మోసంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న సునీల్ను రెండు రోజుల పాటు విచారించేందుకు విజయవాడ ACB కోర్టు అనుమతి ఇచ్చింది. టెండర్ల ప్రక్రియ, నిర్ణయాలు, ఇతర కీలక వివరాలను అధికారులు సేకరించనున్నారు.


