← Back to news

8వ క్లాస్ డ్రాపౌట్.. కానీ డాక్టర్‌గా సర్జరీలు!

By Nani Eluri· 2h ago· Indiatimes
8వ క్లాస్ డ్రాపౌట్.. కానీ డాక్టర్‌గా సర్జరీలు!

రాజస్థాన్‌లో 8వ తరగతితో చదువు ఆపేసిన 34 ఏళ్ల నానంజీరామ్ చౌదరి, నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా రిజిస్టర్ అయ్యి 100 బెడ్ల హాస్పిటల్ నడిపాడు. జాలోర్ జిల్లాలోని ఈ హాస్పిటల్‌లో డాక్టర్లను నియమించడంతో పాటు, తానే సర్జరీలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ MBBS డిగ్రీ, గైనకాలజీ డిప్లొమా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చౌదరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరి వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

8వ క్లాస్ డ్రాపౌట్.. కానీ డాక్టర్‌గా సర్జరీలు!

More in National