← Back to news

ఐటీఐ మైదానంలో గంజాయి.. ముగ్గురికి పాజిటివ్!

By Thallapally Raju· 16h ago· Subhash Nagar, Nizamabad Rural, Nizamabad
ఐటీఐ మైదానంలో గంజాయి.. ముగ్గురికి పాజిటివ్!

నిజామాబాద్ నగరంలోని ఐటీఐ మైదానంలో గంజాయి విక్రయాలు, వినియోగం జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. నలుగురు వ్యక్తులను పట్టుకుని డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒకరు యాక్టివాపై ఉండగా, మరో ముగ్గురు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని కొద్దిదూరం వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో టౌన్ ఎస్హెచ్ఓ యాదగిరి గౌడ్ తెలిపారు.

More in Local