మున్సిపల్ సీట్లపై కూటమి చర్చలు.. నేడే క్లారిటీ?

AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలు ఈరోజు ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. జనసేన 6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలు కోరినట్లు సమాచారం. అయితే 4 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు ఇచ్చేందుకు TDP ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు BJPకి ఒక కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు కేటాయించే అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



