రోడ్డుపై చెత్త పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు

AP: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిధిలోని రాయలం వెళ్లే ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో రోడ్డుపై వెళ్లేవారు అవస్థలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే మార్గంలో పలు కళాశాలలు, హాస్టళ్లు, పాఠశాలలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం, మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన రహదారిని పరిశుభ్రంగా ఉంచాల్సిన పంచాయతీ అధికారులు చెత్తను రోడ్డుపక్కనే వేయడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

