షాద్‌నగర్‌లో ఘన గణేష్ ఆగమన్..!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని జీహెచ్‌ఆర్ కాలనీలో దోస్తానీ యూత్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆకృతిలో మండపం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కౌన్సిలర్ అగ్గనూర్ విశాల, మాజీ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, కౌన్సిలర్లు కొప్పునూరి ప్రవీణ్, దిలీప్, పెంటయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు, యువత, కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

