'నేహా బోరా'ని చంపేస్తామని బెదిరింపులు

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ - AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ‘GenZ రైజింగ్’ ప్రచారంలో ఆమె పాల్గొనగా.. సంస్థ అధికారిక నంబర్‌కు అసభ్యకర మెసేజ్‌లతోపాటూ, "ఆమె చావు ఖాయం" అంటూ వాయిస్ నోట్స్ పంపించారు. దీనిపై తక్షణమే FIR నమోదు చేసి, వార్నింగ్ ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, అలాగే నేహా బోరాకి తగిన సెక్యూరిటీ కల్పించాలని AISA ప్రతినిధులు UP DGPకి కంప్లైంట్ చేశారు.



