యాక్టివిస్ట్‌ను చంపిన వ్యక్తి షాప్‌కు నిప్పు!
పంజాబ్‌లోని మాన్సాలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడిన పర్విందర్ సింగ్ ఝోటా హత్యతో టెన్షన్ నెలకొంది. ఝోటాను కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్విని దుకాణానికి ఓ గుంపు నిప్పు పెట్టింది.షాప్‌కు నిప్పు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెడికల్ షాప్‌లో డ్రగ్స్ అమ్ముతున్నారని ఝోటా ప్రశ్నించడంతో గొడవ జరిగి కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.


