సముద్రంలో ఈదడమంటే నాకు ఇష్టం.. రాహుల్ గాంధీ

"సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఈదడం నాకు చాలా ఇష్టం. ఆ అల్లకల్లోలం వెనుక కూడా ఒక రకమైన ప్రశాంతత దాగి ఉంటుంది. అది నేర్పుతుంది" అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ S.I.R.పై రాజకీయ చర్చ జరుగుతున్న వేళ ఈ పోస్ట్ రావడం ఆసక్తికరంగా మారింది.
