ప్రాణాలు కాపాడే వారికే వసతుల కరవు!

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఫైర్ స్టేషన్కు పక్కా భవనం లేదు. కనీస వసతులు, టాయిలెట్లు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం చుట్టూ విషసర్పాలు సంచరిస్తుండటంతో భయాందోళన నెలకొంది. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.



