← Back to news

రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

By DK· 7h ago· కొమురంభీమ్ జిల్లా
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

కొమురంభీం జిల్లా కౌటాల, చింతలమానేపల్లి మండలాల మిర్చి రైతులకు 18గంటలకు తగ్గకుండా కరెంట్ సరఫరా చేస్తామని సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కౌటాలలో వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో 9చోట్ల 33KV సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, మరో 132KV సబ్‌స్టేషన్ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

More in Local